సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు!

ఏపీలో సర్పంచ్ ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారిని స్వగ్రామాలకు రప్పించేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నాయకులు రానుపోను ప్రయాణ ఖర్చులను భరిస్తామని హామీ ఇస్తున్నారు. 15 మందికి పైగా ఓటర్లు ఉన్నచోట ప్రత్యేక ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా ఒక్కో ఓటుకు రూ.1,000 నుండి రూ.2,000 వరకు నగదు ఇస్తామని అభ్యర్థులు ప్రలోభపెడుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్లతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕