సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు.. BIG UPDATE

ఏపీలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశమై, జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 18 ఏళ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగు సార్లు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణకు ప్రభుత్వానికి సూచించామని గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్