సర్పంచ్ పదవి వేలం.. రూ.29 లక్షలకు దక్కించుకున్నాడు

AP: పంచాయతీలను కైవసం చేసుకోవడానికి ఏకగ్రీవ ఎన్నిక కోసం పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం కొప్పలకొండలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. శ్రీరామాలయ నిర్మాణ నిధుల కోసం సర్పంచ్ పదవికి వినూత్నంగా వేలం నిర్వహించారు. రూ.10 లక్షలతో ప్రారంభమైన ఈ పాటలో ఎల్‌ఐసీ ఆదినారాయణ రూ.29 లక్షలు పాడి పదవిని దక్కించుకున్నారు. వేలం ముగియగానే గ్రామస్థులు 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕