SBLT బస్సు అగ్నికి అహుతి.. తప్పిన ప్రాణాపాయం (వీడియో)

AP: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద పెను ప్రమాదం తప్పింది. శ్రీ సిటీకి చెందిన ఎస్‌బీఎల్‌టీ బస్సు జాతీయ రహదారిపై జీరో పాయింట్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అగ్నికి ఆహుతైంది. గ్రామాల నుంచి కార్మికులను శ్రీ సిటీలో దించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్