AP: రాష్ట్రంలో మంగళవారం ఎండ తీవ్రత కొనసాగింది. అయితే, వాతావరణ అనిశ్చితితో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించింది.