AP: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం బసివిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వర్షాల కారణంగా భవనం పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.