రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అధికారులు శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, సీఎం చంద్రబాబు వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అన్ని రిజర్వాయర్లు, చెరువులను నింపాలని, అవసరమైన చోట మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕