పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వృద్ధురాలు సాలమ్మ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో చికిత్స పొందుతోంది. ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతిచెందారు. మృతిచెందిన వారి శాంపిల్స్ ముంబైకి పంపగా, స్క్రబ్ టైఫస్‌తో మృతిచెందినట్లు రిపోర్టులు వచ్చాయి. అయితే అధికారులు రిపోర్టుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.