కాకినాడ సముద్ర తీరంలో అరుదైన ఆలివ్‌రిడ్లే సముద్ర తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు వచ్చే ఈ తాబేళ్లు, చేపల వేట బోట్లకు తగిలి, మత్స్యకారుల వలల్లో చిక్కి మరణిస్తున్నాయి. ఇటీవల మూడు తాబేళ్ల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. వీటిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు తక్షణమే పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.