విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం

AP: విశాఖ తీరంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళాలు విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఐసీజీఎస్‌ కనక్‌ లతా బరువా, ఐసీజీఎస్‌ వీర నౌకలు, 3 హెలికాప్టర్లతో గాలింపు జరుగుతోంది. ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ కూడా రెండు యుద్ధ నౌకలు, హెలికాప్టర్లను మోహరించింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గల్లంతైన ఏడుగురిలో ఒక మత్స్యకారుడు కారె చిన్న ప్రాణాలతో తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్