వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం హైదరాబాద్‌ మైహోం భూజలోని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేశారు. ఓ సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ సోదాలు చేపట్టారు. వంశీ మొబైల్ ఫోన్ కోసం గాలించారు. అందులో కేసుకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్