సీట్ల సర్దుబాటు అంశం.. కొనసాగుతోన్న చర్చలు

AP: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, లింగమనేని రమేష్‌ భేటీ అయి చర్చలు కొనసాగిస్తున్నారు. విజయవాడ, ఒంగోలు, ఏలూరు, కాకినాడ కార్పొరేషన్లతో పాటు తిరుపతి కార్పొరేషన్‌ కోసం జనసేన పట్టుబడుతోంది. తిరుపతి లేదా నెల్లూరు కార్పొరేషన్‌ కావాలని బీజేపీ కోరుతోంది. సీట్ల పంపకంపై చర్చల బాధ్యతను పవన్‌ కల్యాణ్‌ నాదెండ్ల మనోహర్‌, లింగమనేని రమేష్‌లకు అప్పగించారు. పవన్‌ హైదరాబాద్‌కు బయల్దేరగా, మరికాసేపట్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕