ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను గురువారం, SEC మధ్యాహ్నం 12.30 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది. ఇందులో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు మరో 19 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పంచాయతీ ఎన్నికలకు రేపు మొదటి నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబర్ 26, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.