AP: తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తీవ్ర భద్రతా లోపం చోటుచేసుకుంది. హెలిప్యాడ్ వద్ద పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లను దాటుకుని నేరుగా హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి రైతులు, ప్రజలు వైఎస్ జగన్ వాహనాన్ని చుట్టుముట్టారు. ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు విఫలం కావడంతో భారీ జన సందోహం ఏర్పడి, వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీనితో వైఎస్ జగన్ తన వాహనంలోనే పావుగంటకు పైగా నిలిచిపోవాల్సి వచ్చింది.