AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి విచారణ చేపట్టారు. సా.4 గంటలకు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకెళ్లి హాజరుపర్చారు.