సొంత పార్టీలోనే సీదిరి అప్పలరాజుకు ఇబ్బందులు!

AP: రాష్ట్ర రాజకీయాలపై ఎప్పటికప్పుడు స్పందించే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. తన సొంత నియోజకవర్గంలో మాత్రం పార్టీని పట్టించుకోవడం లేదట. తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలను సీదిరి పక్కన పెట్టారనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఓ కోటరీని నమ్ముకొని.. వారితోనే పార్టీని నడపాలని చూస్తున్నారని వైసీపీ నేతల్లో ఆగ్రహం కనిపిస్తోంది. అయితే ఎన్నికల నాటికి మరింత ఇబ్బంది అవుతుందని, అందరితో కలిసి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్