కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంతో పట్టుదలతో జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్)ను పర్యవేక్షిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ సమీపంలో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. అమిత్ షా పని తీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఇప్పటికే ఏపీకి చాలా సాయం అందిందని, ఇంకా చాలా సహకారం కావాలని అమిత్ షాను సీఎం కోరారు.