AP: అనకాపల్లి జిల్లాలో బెల్ట్ షాపులకు తరలిస్తున్న అక్రమ మద్యంను పోలీసులు సీజ్ చేశారు. మాకవరం గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహణకు తరలిస్తున్న ఈ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ మద్యం సరఫరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.