కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి అస్వస్థతకు గురై వేదికపై నుంచి కిందపడిపోయారు. పార్టీ నాయకత్వ నిర్మాణం, కార్యకర్తల అంకిత భావం వంటి అంశాలపై ప్రసంగించిన అనంతరం ఆయన కిందకు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు సహాయం చేసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.