సైబర్ నేరగాళ్ల వలలో సీనియర్ న్యాయవాది.. రూ. 72 లక్షలు మోసపోయిన వైనం

వైఎస్సార్ కడప జిల్లా బద్వేలుకు చెందిన ఓ సీనియర్ న్యాయవాదిని సైబర్ నేరగాళ్లు మానవ అక్రమ రవాణా కేసులో ఇరికిస్తామని బెదిరించి, ఏకంగా రూ.72 లక్షలు వసూలు చేశారు. సెప్టెంబరు 8 నుంచి నవంబర్ 8 వరకు ఫోన్ చేసి, సిమ్ కార్డులు బ్లాక్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ.72 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయగా, పరువు పోతుందనే భయంతో న్యాయవాది ఏడు విడతలుగా ఫోన్ పే ద్వారా నగదు జమ చేశారు. ఇటీవల ఇదే తరహాలో ఓ శాసన సభ్యుడు, ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు కూడా డబ్బు పోగొట్టుకున్న నేపథ్యంలో, న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్