AP: వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పరిస్థితులపై సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి గళం విప్పారు. జగన్ మెప్పు కోసం భజనలు చేయొద్దంటూ నేతలను హెచ్చరించారు. ప్రజల క్షేమం కోరడం జగన్ క్షేమం కోరినట్లేనని, అలా భజనలు అవసరం లేదని అన్నారు. ప్రజలు చైతన్యవంతులుగా మారుతున్న ఈ కాలంలో భజనలతో గుర్తింపు రాదని, పద్దతిగా నడుచుకోవాలని సూచించారు. కాగా, విధేయత కంటే భజనపరులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆగ్రహంతో మేకపాటి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.