AP: విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి జూన్ 14వ తేదీ రాత్రి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అంత్యక్రియల తర్వాత, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, మొదట సాధారణ కేసుగా నమోదైనది భర్త శ్రీచరణ్‌పై హత్య కేసుగా మారింది. అయితే, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో హత్యకు బలమైన ఆధారాలు లభించకపోవడంతో, పోలీసులు వరకట్న వేధింపుల సెక్షన్ 80(2) BNS కింద శ్రీచరణ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.