AP: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై ఆయన మాజీ అనుచరులు తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనతో సన్నిహితంగా ఉండి, తన పేరుతో లబ్ధి పొందినవారే ఇప్పుడు తనను మోసం చేశారని సురేష్ వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, నందిగం సురేష్ మరియు బేతపూడి రాజేంద్రల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. రాజేంద్ర, నందిగంపై అక్రమ కేసులు పెట్టించడం, పదవులు ఇప్పిస్తానని చెప్పి వాడుకోవడం, మూడు రాజధానుల పేరుతో డబ్బులు నొక్కేశారని ఆరోపణలు చేశారు.