ధర్మాన భూకబ్జాలపై దువ్వాడ సంచలన ఆరోపణలు

AP: వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై భూకబ్జాల ఆరోపణలు చేశారు. ధర్మాన రెవెన్యూ మంత్రిగా పనిచేసిన కాలంలో విశాఖలో 70 ఎకరాలు, టెక్కలిలో రూ.100 కోట్ల విలువైన స్వర్ణకారుల భూములు, శ్రీకాకుళం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దువ్వాడ ఆరోపించారు. ధర్మాన ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని దువ్వాడ అన్నారు. ఈ ఆరోపణలు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్