యూట్యూబర్ జోసెఫ్ రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో పలు ఆరోపణలను పోలీసులు ప్రస్తావించారు. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. యువత, విద్యార్థులను నిషేధిత మావోయిస్టు సంస్థల వైపు ఆకర్షించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగం చేయడంతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రజల్లో వ్యవస్థలపై ద్వేషం, వైషమ్యాలు పెంచేలా వ్యవహరించారని, మావోయిస్టు నాయకుడు హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.