ఏపీలో రాజమండ్రి రాజకీయాలు వేడెక్కాయి. జనసేన మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే మధ్య పోరు నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ, అభివృద్ధి కార్యక్రమాలకు ఒకరినొకరు ఆహ్వానించుకోవడం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి తన డిపార్ట్‌మెంట్ పనులను ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా చక్కబెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి పుష్కరాలు జరగనున్న సమయంలో కూటమి నేతల మధ్య సమన్వయం లోపించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.