ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వైద్య సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా గర్భిణులు, విద్యుదాఘాతంకు గురైన వారు, పాటు కాటుకు గురైన వారి కోసం ఈ సేవలు అందుబాటులో ఉండనుంది. అత్యవసర సేవల కోసం ఫోన్: 90323 84168, 73864 51239, 83748 93549 నంబర్లకు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. మరో మూడు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.