AP: అనంతపురం జిల్లా, గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థులు ఉండగా, వారికి బోధించడానికి ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఈ నలుగురు విద్యార్థులు ఎవరూ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దీంతో పాఠశాల ఫలితాల్లో సున్నా శాతం నమోదైంది. ఈ సంఘటనపై ఎంఈఓ రవినాయక్ స్పందిస్తూ.. విద్యార్థులదే తప్పని, వారంతా ఉత్తీర్ణత సాధిస్తారని ఆశించామని, అయితే ఫలితాలు అనుకున్నట్లు రాలేదని తెలిపారు.