AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటింది. తీరం దాటినా భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండటంతో మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో 5 ఎస్డీఆర్‌ఎఫ్, 4 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. అత్యవసర సాయం కోసం 112, 1070, 1800-425-0101 నంబర్లను అందుబాటులో ఉంచారు.