AP: మయన్మార్-అండమాన్ సమీపంలో వాయుగుండం ఏర్పడింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఈశాన్య బంగాళాఖాతం-బంగ్లాదేశ్ మధ్య వచ్చే 72 గంటల్లో తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.