ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే వీలుంది. కోస్తా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు రానున్న నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕