బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

AP: బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం విశాఖకు 220 కి.మీ. దూరంలో ఉన్న ఈ వాయుగుండం, బుధవారం రాత్రి విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉ.గోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలోని స్కూళ్లకు ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్

✕
✕