తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. నేడు అతి భారీ వర్షాలు

AP: నైరుతి-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 640 కిమీ, విశాఖపట్నంకి 740 కిమీ, కాకినాడకి 710 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి ఇది మరింత తీవ్రతరంగా మారి, రాత్రికి తీరం దాటే అవకాశముందని APSDMA పేర్కొంది. ఈ నేపథ్యంలో కాకినాడ, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సోమవారం (నేడు) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్