ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్

AP: రాష్ట్రం వైపు మురసు తీవ్ర తుఫాన్ దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ ముందుకు కదులుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు 80 కిమీ, కావలికి 80 కిమీ, ఒంగోలుకు 110 కిమీ, మచిలీపట్నంకు 170కిమీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. గంటకు 100-120 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్సుంది. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕