షేమ్‌..షేమ్‌ జగన్‌.. పొదిలిలో మహిళల వినూత్న నిరసన (వీడియో)

AP: ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా మహిళలు నిరసన తెలిపారు. రథం రోడ్డులోని పీఎస్‌ఆర్‌ కాలనీ సమీపంలో నల్లబెలూన్లు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. మహిళలపై టీవీ ఛానెల్‌లో వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిలిలో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘షేమ్..షేమ్‌ జగన్‌’, ‘భారతిరెడ్డి మౌనం వీడాలి’ తదితర నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్