AP: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వైఎస్ షర్మిల తాజాగా స్పందించారు. తనపై సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలేనని, ప్రచారం పూర్తిగా అబద్ధమన్నారు. తానంటే గిట్టని వాళ్లు చేస్తున్న పనులేనని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ను చివరిసారిగా కలిసింది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనేనని, ఇప్పుడు మళ్లీ కలిసినా.. తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు.