ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కర్ణాటక కోటా నుంచి తనకు రాజ్యసభ పదవిని కేటాయించాలని రాహుల్ గాంధీని ఆమె కోరినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది ఇంకా స్పష్టం కానప్పటికీ, ఈ భేటీ ఏపీతో పాటు కర్ణాటక రాజకీయాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.