కూటమి ప్రభుత్వంపై షర్మిల తీవ్ర ఆరోపణలు

AP: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కూలీలకు పని దినాల పెంపులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. వైఎస్సార్ హయాంలో 1.10 కోట్ల జాబ్ కార్డులు ఉండేవని, ప్రస్తుతం 65 లక్షలు మాత్రమే ఉన్నాయని, భారీగా కార్డుల కోత పెడుతున్నారని ఆరోపించారు. గత ఏడాదిలోనే 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించారని, మన్రేగా చట్టం ప్రకారం వంద రోజుల పని ఉండేదని, కానీ ఇప్పుడు 52 రోజులు కూడా ఇవ్వడం లేదని, వంద రోజులు కూడా పని ఇవ్వలేని వారు 125 రోజులు పని ఇస్తామని అంటే నమ్మగలమా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్