AP: కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. సుపరిపాలన సాగుతోందని, అభివృద్ధి, సంక్షేమం పేరిట విజయోత్సవ సభలు పెట్టడానికి కూటమి పార్టీలకు సిగ్గుండాలని విమర్శించారు. తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవ సభలో అన్ని అబద్ధాలే చెప్పారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఆరు గ్యారంటీలను ఇప్పటివరకూ అమలు చేయలేదని, నెలకు 15 వందలు ఇస్తామని చెప్పిన మహిళాశక్తి పథకానికి దిక్కులేదని ఆరోపించారు.