AP: అన్నదాత సుఖీభవపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం రైతులకు ఇస్తున్నది అన్నదాత సుఖీభవ కాదని, దుఃఖీభవ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే కేవలం 47 లక్షల మందినే అన్నదాత సుఖీభవకు ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారని, గెలిచిన తర్వాత కేంద్రం ఇచ్చే రూ. 6వేలతో ముడిపెట్టి నాలుక మడతేశారని ఎద్దేవా చేశారు.