గొర్రెల కాపరి మృతి కేసు.. ఎస్ఐ సునీల్‌పై బదిలీ వేటు

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో ఎస్‌ఐ సునీల్‌పై బదిలీ వేటు పడింది. అలసత్వం ప్రదర్శించారన్న అభియోగాలపై సునీల్‌ను ఎస్పీ వీఆర్‌కు పంపించారు. ఈనెల 10న రోడ్డుప్రమాద స్థలంలోనే రాత్రి గస్తీలో ఎస్‌ఐ సునీల్ ఉన్నారు. ఘటనాస్థలాన్ని సిబ్బందితో కలసి ఆయన పరిశీలించారు. ప్రమాదానికి కారకులైనవారి మాటలనే ప్రామాణికంగా తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్