రూ.6 వేల కోట్లతో మచిలీపట్నంలో షిప్‌యార్డు: మంత్రి కొల్లు

AP: గోవా షిప్‌యార్డ్ రూ.6 వేల కోట్ల పెట్టుబడితో మచిలీపట్నంలో ఒక షిప్‌యార్డ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం కృష్ణా జిల్లా ఘంటలమ్మపాలెంలో రూ.75 లక్షల నాబార్డు నిధులతో రహదారి అభివృద్ధి పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. 2026లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి కానుందన్నారు. రూ.40 కోట్లతో చేనేత పరిశ్రమ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్