మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి షాక్!

AP: జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కీలక నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి భారీ షాక్‌ తగిలిందన్న చర్చ జరుగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరును రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో విలీనం చేశారు. ఇక ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి స్థానం రాజంపేట, సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి సీటు తంబళ్లపల్లి సైతం చిత్తూరులో లేవు. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ గట్టి దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్