జగన్‌కు షాక్.. వైసీపీకి విడదల రజిని గుడ్ బై?

AP: వైఎస్ జగన్ కు త్వరలో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ మాజీ మంత్రి విడదల రజినిపై పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరినప్పుడే ఈ ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఆమె వైసీపీలో ఉన్నా, తరచుగా నియోజకవర్గాలు మార్చడంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కూటమి పార్టీలు ఆహ్వానిస్తే, ఆమె చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

సంబంధిత పోస్ట్