త్వరలో వైసీపీకి షాక్.. బీజేపీలోకి విడదల రజిని?

AP: త్వరలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. పదేపదే నియోజకవర్గాన్ని మార్చడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నచ్చని సీటు ఇస్తే పార్టీలో ఉండబోనని ఆమె తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై గతంలో రజిని చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆమె టీడీపీలోకి వెళ్లే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

సంబంధిత పోస్ట్