జోగి రమేష్‌కు షాక్ .. ఐదుగురు అనుచరులపై కేసు

AP: జోగి రమేష్‌కు మరో షాక్ తగిలింది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కృత్తివెన్ను మండలం ఇంతేరులోని మడ, పంచాయతీ భూములను ప్రైవేటు భూములని చెప్పి పలువురు నుంచి రూ.90 లక్షలు వసూలు చేసిన వైనంపై ఆయన అనుచరులు ఐదుగురిపై కృత్తివెన్ను ఠాణాలో కేసు నమోదైంది. నరసాపురానికి చెందిన తమ్ము కల్యాణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కృత్తివెన్ను జడ్పీటీసీ మైలా రత్నకుమారి, శ్రీనివాసరెడ్డి, మైలా రమేశ్, మహేశ్‌, వై.వెంకటరాజుపై ఐపీసీ సెక్షన్లు 420, 386, 506 రెడ్‌ విత్‌ 34 కింద కేసు కట్టారు.

సంబంధిత పోస్ట్