AP: కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సుమారు 30 మంది జనసేన నాయకులు కాంగ్రెస్లో చేరారు. జనసేనలో 12 ఏళ్లుగా పనిచేసినా గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యం దక్కలేదని వారు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీలో నెలకొన్న వర్గపోరు కారణంగానే కాంగ్రెస్లో చేరినట్లు వెల్లడించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఓబీసీ కాంగ్రెస్ చైర్మన్ శొంఠి నాగరాజు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.