AP: కదిరి నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డుకు చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. కదిరి టౌన్ ప్రెసిడెంట్ బాబ్జాన్ మరియు 18వ వార్డు నాయకులు ఖాజా ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. వీరికి కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.