గుడివాడలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 250 మంది

AP: గుడివాడలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమక్షంలో 250 మంది టీడీపీలో చేరారు. మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుడివాడ అభివృద్ధిని చూసే టీడీపీలోకి వచ్చామని, మైనార్టీ షాదీఖానాకు రూ.2 కోట్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు ఖాసిం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕