AP: పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. చింతపర్రు గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో వైసీపీకి చెందిన 60 కుటుంబాలు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.